TEJA NEWS TV : ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సత్తేటి గంగాభవాని పై కులం పేరుతో దూషించడం , మరియు శారీరిక దాడి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ కు వినతి పత్రం సమర్పించిన జైభీమ్ శ్రీనివాస్ , తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షులు*
కీసర గ్రామంలో గంగాభవాని కేసు విషయంలో ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని , ఆమెపై శారీరక దాడి చేయడం మరియు ఆమెని కులం పేరుతో దూషించడం జరిగిందో ఆ నిందితులపై వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు బాధితురాలు అయిన గంగాభవానికి వెంటనే పూర్తిస్థాయిలో న్యాయం చేయవలసిందిగా ఏపీ స్టేట్ ఎస్టీ కమిషనర్ వారికి ఒక వినతి పత్రం జై భీమ్ శ్రీనివాస్ అందించడం జరిగింది.
గంగాభవాని పై దాడి జరిగిన వెంటనే కంచికచర్ల పోలీస్ వారు స్పందిస్తూ , వెంటనే Sc / St Atrocity Act సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి జల్దీ అనిల్ కుమార్ మరియు న్యాయవాది వినయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా : కులం పేరుతో దూషించిన ఘటన పై ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు
RELATED ARTICLES