ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం,
కీసర గ్రామం, విజయవాడ సిటీ లాగా మారబోతున్నదా
కీసర గ్రామంలో నేషనల్ హైవే మీద ఉన్నటువంటి షాప్ యజమానులకు నో రూల్స్, ఎంతటి అధికారులైన సరే షాప్ యజమానులకు తలోగ్గాల్సిందే,
నేషనల్ హైవే స్థలాన్ని ఆక్రమించుకొని షాప్ లు నిర్మించుకొని వ్యాపారం చేసుకుంటున్న పట్టించుకోరు నేషనల్ హైవే అధికారులు,నో రూల్స్
నేషనల్ హైవే స్థలాన్ని ఆక్రమించుకున్న షాప్ లకు ఏ నిబంధనలు ప్రకారం కరెంటు మీటర్లు ఇచ్చారో అర్ధం కానీ పరిస్థితి, సొంత ఇంటికి మీటర్లు పెట్టుకోవాలంటే సవా లక్ష రూల్స్,కానీ ఆక్రమించుకున్న స్థలాలకు నో రూల్స్
STPL హెడ్ ఆఫీసర్స్ ఎలా స్పందిస్తారో అని వెయిట్ చేస్తున్న ఫిర్యాదు దారులు, ఒకవేళ ఆఫీసర్స్ పట్టించుకోలేని స్థితిలో ఉంటే, విధులు సక్రమంగా నిర్వహించడం లేదని కోర్టు కి వెళ్లే ఆలోచనలో ఉన్న ప్రజానీకం
అర్ధం అయ్యిందా రాజా
ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సీఎం, హైకోర్టు జడ్జి, సుప్రీం కోర్ట్ జడ్జి,పీఎం అయినా సరే, కీసర టోల్ గేట్ దగ్గర అధికారుల కాన్వయ్ స్లో అవ్వాల్సిందే,ఎందుకో తెలుసా,ఆ గ్రామంలో ట్రాఫిక్ ఆంక్షలు పని చేయవు,
అధికారుల చూపు మొత్తం కీసర గ్రామంలో ఉన్న షాప్ ల మీద పడటమే, అర్ధం కాలేదా, షాప్ లు మొత్తం నేషనల్ హైవే మీదే అడ్డంగా పెడతారు కాబట్టి, అధికారులు పట్టించుకోరు కాబట్టి అది పరిస్థితి,*
విజయవాడ సిటీలో సిగ్నల్ లైట్స్ వేసినప్పుడు ట్రాఫిక్ ఎంత వుంటదో, కీసర సెంటర్ కూడా అలాగే ఉంటది,
ఆశ్చర్యంగా ఉన్నదా, అయితే ఉదయం 8 గంటలకు, ఈవెనింగ్ 7 గంటలకు కీసర వచ్చేయండి,చూసి ట్రాఫిక్ లో ఉండిపోండి,
కీసర టోల్ గేట్ సిబ్బంది పట్టించుకోరు , నేషనల్ హైవే ఆదారిటీ అధికారులు పట్టించుకోరు,*
యాక్సిడెంట్స్ జరిగి మనిషి ప్రాణం పోయిన, టోల్ గేట్ సిబ్బందికి Don’t Care,సిబ్బందికి కావాల్సింది షాపులు నుండి మామూళ్లు,
కీసర గ్రామంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి, మనిషి ప్రాణాలు పోయాయి, జాలి దయ లేని అధికారులు,
ఎన్నో సార్లు షాప్ లు, తొలిగించారు, మళ్ళీ షాప్లు నేషనల్ హైవే మీద పెట్టుకొనుటకు అనుమతులు ఇచ్చారు, ఇదేక్కడి న్యాయం ప్రభో అని తలలు పట్టుకుంటున్న ప్రజానీకం,
కీసర గ్రామానికి ఎప్పుడు మోక్షం కలిగిద్దో, ఎదురు చూపుల్లో ప్రజలు,
ఎన్టీఆర్ జిల్లా: కీసర గ్రామం, విజయవాడ సిటీ లాగా మారబోతున్నదా…!
RELATED ARTICLES