బిగ్ బ్రేకింగ్ న్యూస్..
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
జాతీయ రహదారి 9వ నెంబరు గల రోడ్డుపై హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న మారుతి సుజుకి ఎర్టిగా AP 39 CY 6740 కారు టైర్లు పగిలిపోవడం వల్ల డివైడర్ పైనుంచి ఆపోజిట్ రోడ్డు మీదకు దూసుకొచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నటువంటి ఇసుజు AP 16 FJ 4599 కారును ఢీకొట్టడం జరిగింది సమయానికి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వటం పెద్దగా ఎవరికి ప్రమాదం సంభవించలేదు ఎర్టిగా కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలు అయినవి వెంటనే స్పందించిన నేషనల్ హైవే అధికారులు మరియు కంచకచర్ల పట్టణ పోలీస్ అధికారులు ఎస్ఐ, సిఐ ప్రథమ చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కంచికచర్ల పోలీసులు ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండాచర్యలు తీసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES