Monday, February 10, 2025

ఉమ్మడి అభ్యర్థి నెగ్గడమే ముఖ్యం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ  జనసేన పార్టీ తరపున, నందిగామ నియోజకవర్గ నాయుకులు, జనసైనికులు, వీర మహిళల తరపున, జనసేన అభిమానుల తరపున నందిగామ నియోజకవర్గం *తెదేపా – జనసేన* ఉమ్మడి అభ్యర్థి *శ్రీమతి తంగిరాల సౌమ్య* గారికి మా హృదయ పూర్వక అభినందనలు. ప్రస్తుత తరుణంలో వేరే ఏవి కాదు ముఖ్యం. మన ఉమ్మడి అభ్యర్థి నెగ్గడమే ముఖ్యం. ఈ సారి మనమందరం కలిసి ప్రస్తుత అరాచక, అసమర్థత, అవినీతి, దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పని చేయాల్సివుంది. జనసేనాని, జనసేన పార్టీ అధినేత *శ్రీ పవన్ కళ్యాణ్* గారు , జాతీయ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి వర్యులు, *శ్రీ చంద్రబాబు నాయుడు* గారు సమర్థమైన అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా అడుగులు వేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టడమే లక్ష్యమని, పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నారు. ఈ సారి ఎన్నడూ లేనివిధంగా ఎన్నికలు జరుగుతాయి. వైకాపా ప్రభుత్వం ,ఈ సారి అన్ని విధాల  అరాచకాలు, రౌడీయిజం చేసి,దొంగ ఓట్లు వేసి, బూత్ లను ఆక్రమించి అన్ని వ్యవస్థలను తన అధీనంలోకి తెచ్చుకొని మళ్లీ అధికారంలోకి  రావాలని కుటిలత్వం, కపటత్వం, కుతంత్రాలకు పాల్పడుతారు. ప్రస్తుతం మన జనసేన నాయకులు,జనసైనికులు, వీరమహిళలు, జనసేనా అభిమానులకు,ముందున్న కర్తవ్యం, మన పొత్తు ధర్మము, తెదేపా అభ్యర్ధి ఆయిన *శ్రీమతి తంగిరాల సౌమ్య* గారికి విజయం చేకూర్చాలి. మన అందరి ఓట్లు మన ఉమ్మడి అభ్యర్థికి సాఫీగా బదలాయింపు జరగాలి  మరియు జనసెన – టీడీపి ప్రభుత్వము ఏర్పడాలి. అప్పుడే మన రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మన మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాకూడదు. *శ్రీమతి తంగిరాల సౌమ్య* గారికి మనము అన్ని విధాల సహకరించి, వారి గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఈ సందర్భంగా జనసేన నాయకులను, జనసైనికలను, వీరమహిళలను, జనసేన అభిమానులందరనీ కోరుకుంటున్నాను. నేను నందిగామ జనసేన పార్టీ ఇన్చార్జిగా ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను, ఎలాంటి సమయంలోనూ మీకు అందుబాటులో ఉంటాను మరియు మిమ్ములని అన్ని విధాల ఆదుకుంటాను. అదైర్యపడకండి. నన్ను నమ్మండి. మీ నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లో వమ్ము చేయను. ప్రస్తుతము మన పయనం *శ్రీమతి తంగిరాల సౌమ్య* గారికి విజయం సాధించే దిశగా ఉండాలి, వారిని ఎమ్మెల్యే గా గెలిపించి మరొకసారి శాసనసభకు పంపాలి. ఈ దిశగా మీరందరూ అడుగులు వేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.

*జై జనసేన*,
*జై తెలుగు దేశం*,
*జై హింద్*.


మీ
*తంబళ్ళపల్లి రమాదేవి*
*జనసేన పార్టీ సమన్వయకర్త*
*నందిగామ నియోజక వర్గం*.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular