ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుద్యోగులకు అధికారులు చేస్తున్న అన్యాయం మీద ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
గ్రూప్ 1 గ్రూప్ 2 , గ్రూప్ 3 ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని.
మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయలని.
జీవో నంబర్ 55 ప్రకారమే గ్రూప్ -1కు సంబంధించిన 503 ఉద్యోగ నియామకాలుచేపట్టాలని
1:100 ప్రకారం అవకాశం కల్పించాలని.
మొదలగు సమస్యలను ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసిన మంద కృష్ణ మాదిగ
RELATED ARTICLES