Tuesday, January 13, 2026

ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ


చండ్రుగొండ: 15-o5-2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ చండ్రుగొండ మండలంలో పర్యటించారు ఈ కార్యక్రమంలో భాగంగా మంగయ్య బంజర్, పోకల గూడెం, రావికంపాడు, ఉపాధి హామీ కూలీలతో కలిసిపనిచేశారు. వారి యొక్క స్థితిగతులను జీవన విధానాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎంజీ ఎన్ ఆర్.ఈజీఎస్ పన్నులు పరిశీలించారు. తదనంతరం రావికంపాడు గ్రామములోని గ్రామ శాఖ అధ్యక్షుడు  బొగిన బోయిన కోటేశ్వరరావు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు గ్రామంలోని రైతులను మునగ పంట వైపు మళ్ళిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రైతులను ప్రోత్సహిస్తున్న భోగిని బోయిన కోటేశ్వరరావును జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో అశోక్, పిడి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాలోతు బోజ్జ్య నాయక్, బొగినబోయిన కోటేశ్వరరావు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular