
TEJA NEWS TV TELANGANA
ఓ ఉపాధ్యాయుడు రోజు ఉన్నత పాఠశాలలో తన ఎలక్ట్రిక్ బైకును రీఛార్జ్ చేస్తున్నాడు, పాఠశాలకు సంబంధించి న విద్యుత్తును అక్రమంగా రీఛార్జ్ చేసి దుర్వినియోగం చేసిన ఈ విషయం చేగుంట మండలం రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు గోపాల్ హిందీ సబ్జెక్టును బోధిస్తున్నాడు, ఇతను రోజు ఎలక్ట్రిక్ బైక్ పై పాఠశాలకు వస్తాడు, అదే బైక్ పై తెలుగు పండిత్ మధుసూదన్ ఉపాధ్యాయుడు, ఇన్చార్జి హెచ్ఎం గా వ్యవహరిస్తున్నాడు, ఈ బైక్ పై మధుసూదను ఎక్కించుకుని వీరిద్దరూ ప్రయాణం చేస్తారు. ప్రతిరోజు పాఠశాలలో విద్యుత్ చార్జింగ్ పెట్టి విద్యుత్ను దుర్వినియోగం చేస్తున్నాడు, ఒక ఎలక్ట్రిక్ బైక్ మినిమం నాలుగు యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జి అవుతుంది. 100 యూనిట్ల మీదనే విద్యుత్ ఛార్జ్ అవుతుంది. పాఠశాలకు వచ్చే గ్రాంట్ నిధులు విద్యుత్ కు బాగానే ఖర్చవుతుంది. ఇదే కాక విద్యార్థులు చదువుతున్న పక్కనే బైకు చార్జి పెట్టడం, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అని పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మధుసూదన్ విలేఖరి ప్రశ్నించగా నీవు ఫోటోలు తీయడం చాలా తప్పు అంటూ దురుసుగా ప్రవర్తించాడు, నీ ఇష్టం వచ్చింది రాసుకో అంటూ వెళ్లిపోయాడు, పాఠశాల బాగోగులు చూసే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఇలా వ్యవహరించడం సరే ఇది కాదు ఇలా వీళ్లు దుర్వినియోగం చేసిన విద్యుత్ యూనిట్ ఖర్చులు విద్యార్థులకు లేదా పాఠశాలకు ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సామాగ్రి ఉపయోగపడతాయి, పై అధికారులు తక్షణమే స్పందించాలి,
ప్రధానోపాధ్యాయురాలు వివరణ
చేగుంట మండలం రెడ్డిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగు బాయి మేడం ను ఫోన్లో వివరణ కోరగా వారు మాట్లాడుతూ మా ఉపాధ్యాయులకు చాలాసార్లు పాఠశాలలో చార్జింగ్ పెట్టకూడదు అని చెప్పిన వారు అలాగే పెడుతున్నారని, ఈ పద్ధతి మార్చుకోమని వివరణ ఇచ్చారు. పాఠశాలలో బైకు చార్జి పెట్టడం సరి అయింది కాదు
మండల విద్యాధికారి వివరణ
మండల విద్యాధికారి నీరజ ఫోన్లో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాలల్లో బైకు రీఛార్జ్ పెట్టడం సరైంది కాదని, విలేకరులను గౌరవించాలి, ఇట్టి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.



