రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా, వరదల వల్ల చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా ప్రజానీకానికి అత్యవసర సేవలు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
విద్యుత్ పునరుద్దరణ పనుల్లో సిబ్బంది నిమగ్నమైన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ “భారీ వర్షంలో విరిగిన చెట్టు కొమ్మల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రానికి వెలుగులు పంచేందుకు రాజీలేని విధి నిర్వహణకు అంకితమైన విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి నా అభినందనలు” అని ముఖ్యమంత్రి ఎక్స్ లో పేర్కొన్నారు.
ఉద్యోగులు, సిబ్బందికి సీఎం రేవంత్ అభినందనలు
RELATED ARTICLES