జగ్గయ్యపేట లో జరిగిన కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం లో గతంలో ఉదయభాను వెంట నడిచిన కమ్మ సామాజిక వర్గం చెందిన నాయకులు 90 శాతం మంది డుమ్మా కొట్టారు
కొంతమంది చూద్దామని, తర్వాత వస్తామని , వేచి చూస్తామని అన్నారు
నియోజకవర్గంలో నాయకత్వ పట్టు ఉన్న నాయకులు తప్ప కింది స్థాయి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు ఎంపీపీలు కౌన్సిలర్లు అందరూ హాజరయ్యారు
*వైసీపీ బాధ్యతలు ఎవరికి*
*ఉదయభాను జనసేనలో చేరడం ఖాయం అవడంతో వైసిపి సీటు ఖాళీ*
వైసిపి రేసులో నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పోటీ నెలకొని ఉంది
వీరిలో కొమ్మినేని రవిశంకర్ ,ఇంటూరి రాజగోపాల్ (చిన్న) తన్నీరు నాగేశ్వరరావు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి
ఇన్చార్జిగా వాసిరెడ్డి పద్మను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది
అయితే రాబోయే కాలంలో జనసేనను నియోజకవర్గంలో ప్రధాన పార్టీగా తీసుకుని రావాలన్న ఉద్దేశం సామినేని ఉదయభాను వర్గంలో ఉంది
ఓ పక్క కూటమి కోటాలో ఎమ్మెల్సీ (జనసేన )దక్కే ఛాన్సులు లేకపోలేదని ఆ హామీ మేరకే ఆయన జనసేనలోకి వెళ్లినట్టు సమాచారం
ఉదయభాను సమావేశానికి కమ్మ సామాజిక వర్గం డుమ్మా*
RELATED ARTICLES