ఆరోగ్యమే మహాభాగ్యము..
ఉచిత మెగా వైద్య శిబిరాలు ప్రజల ముంగిట రావడం శుభపరిణామం.. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
ఆర్ ఆర్ హాస్పిటల్, కర్నూలు వారి సౌజన్యంతో మౌంట్ కార్మెల్ స్కూల్, కోసిగి నందు ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండల ఇంచార్జీ పి మురళీ మోహన్ రెడ్డి హాజరు
వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి, ప్రజల ముంగిట ఉచితంగా నాణ్యమైన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యాన్ని అందివ్వడం చాలా శుభపరిణామమని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పెర్కోన్నారు.మంగళవారం మండల కేంద్రము కోసిగి నందు మౌంట్ కార్మెల్ స్కూల్ ఆవరణలో పాదర్స్ జోజి, బాల ఏసు నేతృత్వంలో ఆర్ ఆర్ హాస్పిటల్,కర్నూలు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి మండల ఇంచార్జీ పి మురళీ మోహన్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి ఫాదర్స్,డాక్టర్లు,అతిధుల సమక్షంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరాలకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన వైద్యులు డాక్టర్ రోహిత్,రాహుల్, రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమైన మా మండలంను గుర్తించి, ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ, అవసరమైతే ఆపరేషన్ కూడా ఉచితంగా చేసి,వైద్య సేవలను అందిస్తున్న ఆర్ ఆర్ హాస్పిటల్, కర్నూలు వారు ముందుకు రావడం, అందుకు దోహదపడిన మౌంట్ కార్మెల్ యాజమాన్యంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆరోగ్య సృష్టికర్త,దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని,గత ప్రభుత్వంలో జగనన్న వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా,ఈ ప్రభుత్వంలో యన్టీఆర్ ఆరోగ్య శ్రీ గా పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు. యన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలను మరింతగా విసృతం చేసి, పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కృష్ణ రెడ్డి,యంపిపి ఈరన్న, నాడిగేని నరసింహులు, బెట్టనగౌడ్,మహాంతేష్ స్వామి, యన్ నాగరాజు,వైస్ యంపిపి మాన్వి వెంకటేష్,మంగమ్మ, బీమక్క,షౌఖత్,బసిరెడ్డి, వీరాస్వామి,బుళ్ళి నరసింహులు,ముకుంద కృష్ణమూర్తి,షంషుద్దీన్,జగదీష్ స్వామి,వీరాస్వామి,దొడ్డి నర్సన్న,వందగల్లు,అగసనూర్, సజ్జలగుడ్డం,చిన్న బొంపల్లి,పెద్ద బొంపల్లి,జంపాపురం,చిర్తనకల్లు, ముగలదొడ్డి,నేల కోసిగి సర్పంచ్లు లక్ష్మయ్య, ఉలిగయ్య,మల్లయ్య,ఉసేని, గట్టు భీమయ్య,ఆరోన్,ఈరన్న, సోమేష్,లక్ష్మన్న,దుద్ది నాగేష్ రామలింగ,మల్లికార్జున గౌడ్ ఆకాష్,ఆర్లబండ పరుశురాం, ముక్కిరయ్య,కొరివి నాగరాజు, కుమార్, రహీం, నూర్, శివారెడ్డి, బెళగల్ వీరన్న గౌడ్,బీమా సేన తదితరులు పాల్గొన్నారు
ఉచిత మెగా వైద్య శిబిరాలు ప్రజల ముంగిట రావడం శుభపరిణామం.. -ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
RELATED ARTICLES