సంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు 30 రోజుల ఉచిత కోచింగ్ కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇట్టి ప్రవేశ పరీక్ష సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ సురేశ్, సింగారపు బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా మాంకాల యాదగిరి అంబేద్కర్ యువజన సంగెం వరంగల్ జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద, పేద విద్యార్థులకు ఈ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని, పేద విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని విద్యాభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, సమాజాన్ని చైతన్య పరిచి, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగానిలవాలని, అన్ని సబ్జెక్టుల పట్ల పూర్తి నివృత్తి చెంది, క్రమశిక్షణతో మెదలాలని, చదువు ను ఆయుధంగా చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు, మార్గం సంస్థ నిర్వాహలను అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎస్సై సీతారాం నాయక్, కానిస్టేబుల్ కుమారస్వామి, కరుణశ్రీ, కిషన్ కుమార్, వీరాచారి, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కోచింగ్ సెంటర్ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం
RELATED ARTICLES