TEJA NEWS TV
రిపోర్టర్లు కావలెను 9985859485
తిరుపతి – పద్మావతి నగర్లో సొంత అన్న పిల్లలు దేవిశ్రీ, నీరజలతో పాటు వదిన సునీతను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న గుడిమెట్ల మోహన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
అన్న ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి కత్తితో వదిన మరియు పిల్లలపై దాడి చేసి.. తర్వాత అదే గదిలో ఫ్యానుకు ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే తనకు పెళ్లై ఓ బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోవడం.. తనకు ఇష్టం లేని పెళ్లి చేసి అన్న కుటుంబం సంతోషంగా ఉండటంతో వారిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.