సార్వత్రిక ఎన్నికల్లో హామీలలో భాగంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై ఇంటి స్థలాల కేటాయింపు పై ఇచ్చిన మాటపై నిలబడి హామీని నెరవేర్చుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఇంటి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం పట్టణాలలో ఒక సెంటు లలో ఒకటిన్నర సెంటు పేదలకు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇంటి నిర్మాణం కోసం 1,80,000 ఇవ్వడంతో ఇచ్చిన సొమ్ము బేస్మెంట్ వరకే సరిపోయి మిగతా ఇంటి నిర్మాణం కట్టెకోలేని పేదలు అర్ధాంతరంగా ఇంటి నిర్మాణాలు ఆపివేసుకున్న దుస్థితి ఏర్పడిందని, అప్పటి ప్రభుత్వం ఇచ్చిన స్థలం కూడా ఇంటి నిర్మాణానికి సరిపోదు అంటూ ఎన్నికల హామీలలో గల మెత్తిన చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఇంటి నిర్మాణం కోసం గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వమే మంజూరు చేయాలని వామపక్ష సంఘాల నాయకులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ మండల కార్యదర్శి గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు స్థలం కేటాయిస్తామని ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేస్తామని చెప్పడం సానుకూల అంశం అయినప్పటికీ ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ఇసుక ,ఇనుము, సిమెంటు కంకర వాటి తరలింపు పేదలకు కష్టతరమైనదని కాబట్టి సిమెంటు, ఇసుక, కంకర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని గత ప్రభుత్వంలో మాదిరి ఊరి వెలుపల నివాసానికి యోగ్యంగా లేని ప్రదేశంలో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా నివాసానికి అనువైన స్థలాలలో ఇంటి నిర్మాణాలను చేపట్టి అక్కడ రోడ్లు,విద్యుత్ ,త్రాగనీరు, డ్రైనేజ్ పారుదల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ మరియు మండల కార్యదర్శి వామపక్ష నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సిపిఐ సిపిఎం వామపక్ష నాయకులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
RELATED ARTICLES