భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 21-05-2025
ఇల్లందు మండలం
TEJA NEWS TV: వానాకాలం ముందుగానే రావడం, అలాగే జీలుగు, జనుము లాంటి పచ్చిరొట్ట విత్తనాల ధరలు గతేడాది తో పోల్చితే భారీగా పెరగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇల్లందు మండల బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షులు మరియు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా బావ్ సింగ్ నాయక్ . విత్తనాల కొరత ఇప్పటికే మండలంలో కనిపిస్తున్నదని, దీనికి కారణం ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధిక ధరలకు విత్తనాలను విక్రయించడమేనని విమర్శించారు.
ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతిపత్రాన్ని అజ్మీరా బావ్ సింగ్ నాయక్, నేతృత్వంలో రైతు సంఘం నాయకులు కలిసి వ్యవసాయ అధికారి (AO) కి అందించారు.
ఈ సందర్భంగా బావ్ సింగ్ నాయక్ , మాట్లాడుతూ –
“పచ్చిరొట్ట విత్తనాలు వేసి ప్రకృతిని, భూమిని పరిరక్షించమని రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అదే విత్తనాలను అధిక ధరలకు విక్రయించడం అత్యంత బాధాకరం. అంతేగాక, నకిలీ విత్తనాలు కొత్త బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లోకి వచ్చి రైతులను మోసగిస్తున్నాయి. వీటిని వెంటనే అడ్డుకోవాలి. రైతుల బతుకుల్ని రక్షించడంలో ప్రభుత్వం శీఘ్రంగా స్పందించాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కాసాని హరిప్రసాద్ యాదవ్, భూక్యా సురేష్, ధారావత్ రమేష్, భూక్యా హుస్సేన్, అజ్మీరా రాందాస్, బోడ రమేష్, అజ్మీరా చినబాబు, ఉపేందర్ రావు, వార రమేష్, అజ్మీరా మంజి, పి. లక్ష్మీనారాయణ, లావుడియా శంకర్, భూక్యా రాంజీ, మంగీలాల్, గూగులోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
