బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో జామ మసీద్ లో బుధవారం సాయంత్రం మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాసం ఉన్న మైనార్టీ సోదరులకు పండ్లు ఇచ్చి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, రంజాన్ పర్వదినం సందర్భంగా అడ్వాన్స్ గా ముస్లిం సోదరి, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమను నెలవంక చూసినప్పటినుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి, దేవుని కృపకు పాత్రులవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సలీం, నహీం, మౌల్సాబ్, అరిఫ్, అస్లాం, అయూబ్,అదిమ్, షారుక్ ఖాన్, మహిపాల్ రెడ్డి, శ్రీమాన్ గౌడ్ పాల్గొన్నారు
ఇఫ్తార్ విందు ఎప్రాటుచేసిన రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్
RELATED ARTICLES