![](https://tejanewstv.com/wp-content/uploads/2024/11/img_20241122_110053_36186329526936596572-575x1024.jpg)
TEJA NEWS TV
ములుగు జిల్లా.
వాజేడు మండలం.
దేశవ్యాప్తంగా
ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కగార్ పేరిట మావోయిస్టులపై విరుచుకు పడుతున్న మాట విధితమే, ఈ దెబ్బతో ఎన్నడు లేని విధంగా మావోయిస్టులు వారి ప్రాబల్యాన్ని కోల్పోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి., అయితే ఇటీవల కాలంలో తీవ్ర ఎదురు దెబ్బలు సైతం తిన్న మావోయిస్టులు, పోలీసులను ఎదురు దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగా ప్రతి ఎన్కౌంటర్లో సమాచారంతోనే పోలీసు బలగాలు ముందుకు వెళ్లి చావు దెబ్బ కొడుతున్నారు అని గమనించిన మావోయిస్టులు పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్న వారిని ఏరు వేసే పనిలో ఉన్నట్టుగా నిన్న రాత్రి జరిగిన సంఘటన బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతికార యుహాలతో రగిలిపోతున్న మావోయిస్టులకు వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఊహిక రమేష్ అర్జున్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారు అని, అనుమానంతో వారిని హతమార్చిన సంఘటన వాజేడు మండలంలో సంచలనంగా మారింది. ఈ ఘటనతో ఒక్కసారిగా మండలమంతా ఉలిక్కిపడింది. ప్రస్తుతంమండలoలో భయానక వాతావరణం నెలకొంది.