తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
గత సాధారణ ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి అన్నారు.
సంగెం మండలం లోని గ్రామాలలో గవిచర్ల, షాపూర్, లోహిత, పెద్ద తండా, రామచంద్రపురం, ఆశాలపల్లి, కాపుల కనపర్తి, కాట్రపల్లి, కుంటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ చేశారు.
మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వదిలి పెట్టేది లేదన్నారు. కేసీఆర్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని మాయ మాటలతో ఆశలు పెంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇకపై ఏ ఎన్నికలు వచ్చిన తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి జక్క మల్లయ్య, సమన్వయ కమిటీ సభ్యులు పులుగు సాగర్ రెడ్డి, దోపతి సమ్మయ్య, సుతారి బాలకృష్ణ, మెరుగు వీరేశం, మాజీ కో ఆప్షన్ సభ్యులు మన్సూర్ అలీ, ఆయా గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




