భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
27.08.2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ఆమె చెబుతూ –
“ఇందిరమ్మ ఇల్లు కట్టించుకుంటే సాయం దొరుకుతుందనుకున్నా. కానీ అధికారులు చేసిన తప్పిదం వల్ల నా బిల్లు నాలుగు నెలలుగా ఆగిపోయింది. బిల్లు రాకపోవడంతో అప్పులు తెచ్చి మరీ ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పుడు అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారు. నాకు దారి కనిపించడం లేదు. అధికారులు నా ఇల్లు కూల్చివేసినా పర్వాలేదు, కానీ నా బిల్లునైనా ఇవ్వాలి” అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె ఇంకా చెప్పింది:
“ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. ముఖ్యమంత్రి వచ్చే రోజే నా బాధను ఆయన ముందు ఉంచుతాను. కనీసం ఆయనైనా నా సమస్యను తీర్చాలి” అని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇందిరమ్మ ఇల్లు వల్ల అప్పుల పాలైన మహిళ – బిల్లులు ఆగిపోవడంతో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వేదన
RELATED ARTICLES



