కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని రీ సర్వే ట్ ప్రాజెక్టుగా ఎన్నికైన చింతకుంట గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడానికి కోసిగి మండలానికి విచ్చేసిన ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ రి సర్వేకు సంబంధించిన అంశాలపై చింతకుంట గ్రామ సచివాలయం నందు అధికారులతో చర్చించి, రీసర్వే భూములను పరిశీలించిన అనంతరం మండల కేంద్రంలోని సమస్యల పుట్టగా ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా గతంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ దోమలకు, పందులకు, నిలయమై అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు అన్న వార్తలు, మరియు తమకు అందిన వినతి పత్రంపై స్పందించి హాస్టల్ పరిసరాలలో గరుసు తోలించి శుభ్రపరచాలని గతంలో ఆదేశించిన సబ్ కలెక్టర్ ఆ పనులను ఈ రోజు పరిశీలించారు. పరిశుభ్రత పనులు సగం వరకే జరిగాయని హాస్టల్ వెనుక వైపు మురుగునీరు చేరి ఉండటం, హాస్టల్ ముందు భాగంలో డంప్ యార్డ్ ఉండడంతో వెంటనే తొలగించి హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయానా డివిజన్ సబ్ కలెక్టర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను పరిశీలించడానికి వచ్చినప్పుడు హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తో పాటు ఎమ్మార్వో రుద్ర గౌడ్ మరియు రెవెన్యూ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారులు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
RELATED ARTICLES