Wednesday, January 22, 2025

ఇంటింట ప్రచారం చేసిన నందిగామ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరాస్వామిన్

*వంద రోజుల్లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల చేసిన ఎన్డీఏ ప్రభుత్వం……..!!!!!*_

*ఇంటింట ప్రచారం చేసిన నందిగామ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరాస్వామిన్…….!*

*ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు, తక్కెళ్ళపాడు, మునగచర్ల

*గౌరవముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి*
*ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని  వీరంకి వీరాస్వామిన్ పేర్కొన్నారు.*

*రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు నందిగామ శాసనసభ్యులు శ్రీ తంగిరాల సౌమ్య గారి ఆదేశానుసారం నందిగామ మండలం మునగచర్ల, లింగాలపాడు ,తక్కెళ్ళపాడు గ్రామలలో*
*కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం* *కార్యక్రమంలో నాయకులు మరియు* *అధికారులతో* కలిసి *వీరాస్వామిన్ పాల్గొన్నారు.*

*ముందుగా ఇంటింటికి  100 రోజుల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రలను ప్రజలకు అందించారు.*

*ఈ సందర్భంగా వీరంకివీరా స్వామిన్  మాట్లాడుతూ*..
_ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, గత 5 ఏళ్లలో కనిపించని మార్పు ఈ వంద రోజుల్లో కనిపిస్తోందన్నారు._

_మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించడం అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి
నాయకత్వంలో  ప్రతివర్గానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు._

_సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి 5 సంతకాలను ఐదు ముఖ్యమైన అంశాలపై పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై పెట్టి 16,437 ఉపాధ్యాయ నియామకాలకు పచ్చ జెండా ఊపారన్నారు._

_గతంలో ఉన్న 3 వేల పింఛనును వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారేనని కొనియాడారు. ప్రతి నెలా 1వ తేదీనే పింఛను అందిస్తూ వారిని ఆదుకుంటున్నారని *వీరాస్వామిన్ హర్షం వ్యక్తం చేశారు.*_
ఈ కార్యక్రమంలో లింగాలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మినేని విక్రమ, వడ్లమూడి శ్రీనివాసరావు, తక్కెళ్ళపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గరిమిడి సురేష్ బాబు, దామలూరి రామచంద్రరావు, గరిమిడి శ్రీనివాసరావు, మార్కపుడి సంగయ్య, గరిమిడి రమేష్, అప్పారావు, ప్రభాకర్ రావు మరియు కూటమీ నాయకులు మరియు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు._

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular