ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని ఆలమూరు గ్రామంలో గురువారం నాడు ఇంటింటి ప్రచారంలో గంగుల సారికమ్మ దూసుకుపోతున్నారు. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే తన భర్త ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిని మరొక్కసారి అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించాలన్నారు.అలాగే మరోవైపు ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రీజేంద్ర రెడ్డి రోడ్ షోలో వేగం పుంజుకున్నారు.వారివెంట వైసీపీ సీనియర్ నాయకుడు పుటాలమ్మ క్షేత్రం చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి,ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న గంగుల సతీమణి
RELATED ARTICLES