వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేసారు. సోమవారం నందిగామ కాకానీ నగర్ కార్యాలయంలో “ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఇవ్వండి భావితరాలకు నీరు అందించండి” అను నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు నందిగామ పట్టణంలో ఇంకుడు గుంతలను ఉద్యమస్ఫూర్తితో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రతి ఇళ్లు, అపార్ట్ మెంట్స్, కార్యాలయాలు, పరిశ్రమ ఆవరణలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. లేని పక్షంలో తదననుగుణంగా శాఖపరమైన చర్యలుంటాయని సూచించారు. సొంత ఇల్లు ఉన్నప్పటికీ కేవలం కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరియు స్నానం చేయడం కోసం ఇతర ప్రాంతాల్లో అద్దెకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇటువంటి పరిస్తుతులలో ఇంకుడు గుంత ఇంట్లో ఉండవలసిన అవసరం ఎంతో ఉందని, దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువని, నో వాటర్ నో ఫ్యూచర్ వాటర్ లేకుండా మనిషి గంట కూడా గడపలేడని, మన కోసం మన పిల్లల కోసం వాటర్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఎన్టీఆర్ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు రామిరెడ్డి శ్రీధర్ అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముద్రించిన పదివేల కరపత్రాలను అందరికీ అందజేసారు. ప్రతి ఇంటికీ వీటిని సిబ్బందితో అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ హేమామాలినీ, ఎఈ శ్రీనివాస్, కాకతీయ అపోలో సంస్థల అధినేత కాపా రవీంధ్రనాథ్, ఆసరా ఫౌండేషన్ అధినేత వాసిరెడ్డి వంశీ, పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధిలు తదితరులు పాల్గొన్నారు…..
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES