Wednesday, January 14, 2026

ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ



02.08.2025 – శనివారం
📍 చండ్రుగొండ మండలం

చండ్రుగొండ మండలంలోని రావికంపాడు, బెండాలపాడు గ్రామాల్లో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులు అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ – “ఇన్నేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇది ఒక పెద్ద వరం. ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పల్లె ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి” అని అన్నారు.

అలాగే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular