Monday, January 20, 2025

ఆశా వర్కర్ తోట రాధమ్మ మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఏ.కొండూరు మండలం ఏ. కొండూరు పిహెచ్ సిలో అధికారుల నిర్లక్ష్యం వలన మృతి చెందిన ఆశా వర్కర్ తోట రాధమ్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ……*

నందిగామ లింగాలపాడు MPHO బింక్షాలు, & ఆశా నోడల్ ఆఫీసర్ సరోజిని గారికి వినతి పత్రం అందిస్తున్న సిఐటియు నాయకులు..*

లింగాలపాడు,గోళ్ళమూడి, నందిగామ డివిఆర్ కాలనీ, అనాసాగరం,PHCలలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది….*

*ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. గోపాల్ మాట్లాడుతూ*
ఏ కొండూరు దళిత పేటకు చెందిన తోటరాధమ్మ ఏ.కొండూరు పిహెచ్సిలో గత 18సంవత్సరాల నుండి ఆశా వర్కర్గ పనిచేస్తున్నది.అదే గ్రామంలో దళితపేటకు చెందిన 23 సంవత్సరాలు యువకుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు.ఈ సంఘటనతో స్పందించిన స్థానిక పిహెచ్సి అధికారులు ఇంటింటి సర్వే చేయాలని అక్కడ ఆశ వర్కర్లను ఆదేశించారు.అక్కడ సర్వే డ్యూటీలో మూడు రోజులు పాల్గొన్న ఆశా వర్కర్ రాధమ్మకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చింది.నాకు జ్వరం వచ్చింది సెలవు కావాలని ఏఎన్ఎం గారిని అడగ్గా సెలవు ఇవ్వడం కుదరదని డ్యూటీ చేయాల్సిందేనని చెప్పారు. జ్వరంతోనే 2రోజులు సర్వేలో పాల్గొన్నది.రిక్వెస్ట్ చేసినా నీకు జ్వరం వచ్చిందని రుజువు చూపించమని చెప్పడంతో ఏ. కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చూపించుకున్నారు. అప్పటికే ఆమె చాలా నీరసంగా ఉండడంతో స్థానిక మెడికల్ ఆఫీసర్ తిరువూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు.తిరువూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి సీరియస్ గా ఉంది.విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్ళమని సూచించారు. అప్పటికే పరిస్థితి మరింత దిగజారడంతో చిన్న అవుటపల్లి ఆస్పత్రికి తీసుకెళ్ళగా అక్కడ డాక్టర్లు చూసి అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనలో ఆమెకు జ్వరం వచ్చినప్పుడు అడిగిన రోజే సెలవు ఇచ్చి ఉంటే ఆమె మృతి చెందేది కాదనీ,సెలవు ఇవ్వకుండా డ్యూటీ చేయించడం,కనీసం హాస్పటల్కి వెళ్లి చికిత్స చేయించుకునే అవకాశం కూడా లేకపోవడం వలనే ఆమె మరణించిందని భావిస్తున్నాము. ఆమె అనారోగ్య పరిస్థితిని అర్ధం చేసుకోకుండా అధికారులు వ్యవహరించడం శోచనీయం. గతంలో పల్నాడు జిల్లా తాడేపల్లి పిహెచ్సికి చెందిన కృపమ్మ జగనన్న సురక్షా కార్యక్రమంలో డ్యూటీ చేస్తూ హార్ట్ ఎటాక్ గురైంది.అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెను హాస్పటల్కు తీసుకువెళ్ళకపోవడంతో అక్కడికక్కడే మరణించింది.దీనిపై జిల్లా కలెక్టర్, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఆమె కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్రేషియా, మట్టి ఖర్చులు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం,ఇళ్ళ స్థలం ఇచ్చారు.వివిధ కారణాలతో మరణించిన డొక్కా విజయలక్ష్మి, రమావత్ లీలావతి కుటుంబాలకు కూడా రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించటం జరిగింది. కావున తోట రాధమ్మ మృతిపై విచారణ జరిపించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాము.ప్రభుత్వం, అధికారులు వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.

1) తోట రాధమ్మ మృతిపై విచారణ జరిపించాలి.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

2) కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్రేషియో చెల్లించాలి.ఒక ఎకరం వ్యవసాయ భూమి ఇవ్వాలి.

3) కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి.

4) అనారోగ్యంతో ఉన్న ఆశా వర్కర్లకు సెలవులు మంజూరు చేయాలి.

*ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సిఐటియు నాయకులు తిరుమల దేవి, వనజ,ప్రభావతి,నాగమణి, గోవిందమ్మ,శివకుమారి,స్రవంతి, కవిత,సునీత,ప్రశాంతి,మోనిక,పద్మ,యేసురాజాం,కవిత,నాగ రాజ్యం,నాయకులు తదితరులుపాల్గొన్నారు…..*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular