తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని చిన్నపాండూరు. వరదయ్యపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రల వద్ద ఆశా వర్కర్ల యూనియన్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు. వాణి. చంద్రయ్య ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల కోర్కెల సాధన దినం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని ఈ ఎస్ ఐ. పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కాపాడే విషయంలో ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించకుండా స్కీం వర్కర్ల పేరుతో మా కష్టాలను దోసుకుంటుందని రాపోయారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భవతుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలోనూ గ్రామీణ ప్రాంతాలలో ప్రభలే కాలరా. ఫైలేరియా. క్షయ మలేరియా టైఫాయిడ్ లాంటి అనేక రోగాలను గుర్తించడంలో ఆశా వర్కర్లకు ఆధారపడి ఉందని అలాగే గ్రామాలలో జరిగే ప్రతి సర్వే. లెక్కలు మేమే సమర్పించాలని. సమాజంలో అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ఆశ వర్కర్లు ముందుంటున్నారని అయితే వీరికి పని భద్రత లేకుండా ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకుండా ప్రభుత్వాలు పెడుతున్న సంక్షేమ పథకాలు ఆశా వర్కర్లు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం మా కోరికలను నెరవేర్చాలని లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వాణి.చంద్ర డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిన్నపాండూరు వరదయ్యపాలెం ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లకు పని భద్రత కల్పించాలి ఏఐటీయూసీ
RELATED ARTICLES