

నంద్యాల జిల్లా….
నంద్యాల జిల్లా లోనే అత్యధికంగా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుండి అనేక సేవలు అందించి అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు తెలిపారు…
ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్స్ మరియు సిబ్బంది కి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ధన్యవాదాలు తెలిపారు…
ఆళ్ళగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకోనేలేలా పనిచేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు తెలిపారు…
ఆళ్ళగడ్డ లోని ప్రైవేట్ ఆసుపత్రి యజమానులు కూడా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిని ఇలా డెవలప్ చేస్తే మా పరిస్థితి ఏంటని మొరపెట్టుకున్నా సందర్భాలు ఉన్నాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు అన్నారు…
ఇచ్చిన హామీ ల ప్రకారం 30 పడకల నుండి 50 పడకల కు ఎలా అయితే అయితే డెవలప్ చేశానో అలాగే ఇప్పుడు కూడా 50 పడకల నుండి 100 పడకల కు డెవలప్ చేసి మరింతగా వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలపడం జరిగింది…
ఇప్పటికే ఈ 100 పడకల ఆసుపత్రి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే రాబోయే అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ సమస్యను లేవనెత్తుతా నని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు తెలిపారు…
అలాగే ఆళ్ళగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ కొరత & సరైన ఎక్విప్మెంట్ లేవని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి దృష్టికి వచ్చిందని త్వరలోనే సీఎం చంద్రబాబు గారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు….
రాబోయే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన అనంతరమే 100 పడకల ఆసుపత్రి అలాగే మిగిలిన పనులను కూడా మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
రాబోవు వేసవి కాలంలో ప్రజల ఆరోగ్య విషయలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఆదేశించారు…
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ తరఫునుంచి హృదయ రక్ష అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అలాగే 108 వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు తెలిపారు….
ఈ హృదయ రక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు గుండె సంబంధిత , ఆయాసం , చెస్ట్ పెయిన్ మొదలగు వంటి సేవలను వైద్యలు అందిస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
రూ. 45 వేల రూపాయల విలువ గల ఇంజెక్షన్ ప్రభుత్వ తరపున ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు..
అలాగే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకొని ప్రజల మన్ననలు పొందుతున్నందుకు ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ గారు వైద్యులను అభినందించి సంతృప్తి వ్యక్తం చేశారు….



