Wednesday, January 22, 2025

ఆళ్ళగడ్డ టీడిపి కార్యాలయంలో తాలుకా టీడీపి నాయకులు ప్రెస్ మీట్ కామెంట్స్

TEJA NEWS TV — ఆళ్ళగడ్డ టీడిపి కార్యాలయంలో తాలుకా టీడీపి నాయకులు ప్రెస్ మీట్ కామెంట్స్ :

ఆళ్లగడ్డ మండల కన్వీనర్ హరి కుమార్ రెడ్డి కామెంట్స్ :

మాజీ ఎమ్మెల్యే మరియు కిశోర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు అందించిన వినతి పత్రం పై మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది…

సర్పంచులను నాశనం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది మీ ప్రభుత్వం
కనీసం వారికి జితాలివ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారు మీరా నీతులు చెప్పేది…

మాట్లాడే ముందు ఆలోచించండి పబ్లిసిటీ కోసం అనవసర ఆరోపణలు చేయడం మానుకోండి

ఈరోజు మా ఎమ్మెల్యే గారు 15th ఫైనాన్స్ కింద గ్రామాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ డబ్బులో ముఖ్యంగా ఆరు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్న స్వీపర్స్ అందరికీ జీతాలు ఇవ్వాలని అలాగే పార్టీలకు అతీతంగా పని చేసే ప్రతి ఒక సర్పంచ్ కు 15th ఫైనాన్స్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్తున్నాము
ఈరోజు మీరు గాలి మాటలు చెప్తున్నారు కనుక ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా ప్రజలే చేశారు

ఈరోజు ఏదో గ్రావెల్ గురించి మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గారు రామతీర్థం పుట్టాలమ్మ దగ్గర మీరు గ్రావెల్ తోలుతుంటే మా ఎమ్మెల్యే  అఖిలమ్మ గారు ప్రతిపక్షంలో ఉండి నాలుగు నెలల గర్భవతి అయి ఉండి కూడా అక్కడికి వచ్చి మీ గ్రావెల్ వర్క్ ను ఆపించి మీకు ఫైన్ వేసి వర్క్ ఆపేలాగా చేసారు మీకు అది గుర్తులేదా ఈరోజు మీరు మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు

దయచేసి మీకు నేను ఒక్కటే చెప్తున్న మా నాయకులు కానీ కార్యకర్తలు గాని ఎవరైనా ఇలాంటి పనులు చేసి ఉంటే ఆధారాలతో నిరూపించండి చిల్లర ఆరోపణలు మానుకొని ఉంటే బాగుంటుంది


సింగం భరత్ రెడ్డి కామెంట్స్ :

మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాం

ఈరోజు ఇసుక మీద ఎదో ఆరోపణలు చేస్తున్నారు ఇసుక అంటేనే ఆళ్లగడ్డ లో గుర్తుకు వచ్చేది నువ్వే అని అందరికి  తెలుసు గత ప్రభుత్వం లో మీరు చేసిన అక్రమాలు అన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద తోస్తున్నారా

ఈరోజు ఇసుక మీద మాట్లాడుతున్నారు మార్కెట్ యార్డ్ లో ఉన్న ఇసుక మొత్తం మీరే దొబ్బేశారు దీని మీద మేము కూడా ఎంక్వయిరీ పెట్టించడం జరిగింది

ఆళ్లగడ్డ లో ఎదో వసూళ్లు చేస్తున్నారు అంటున్నారు గతం లో మీరు గేట్లు కట్టకుంటే లారీ టైర్లు పంచర్ చేసి మరి రెండు రోజులపాటు ఇక్కడే పెట్టుకున్న మీ కౌన్సిలర్ ఎంతగా హింసించారో మీకు గుర్తు లేదా కేసులు కాలేదా ఈరోజు మీరు నీతులు మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే ఆధారాలు నిరూపించి మాట్లాడండి అంతేకానీ ఇలా గాలి మాటలు బురదచల్లే మాటలు దయచేసి మాట్లాడొద్దు

గతంలో మినుము రైతులకు గుంటూరు వాళ్ళు సీడ్ ఇవ్వడం జరిగింది పంట బాగా రాలేదు అనే కారణం తో సిడ్స్ కంపెనీ వాళ్ళు 8 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది ఆ నష్టపరిహారం మొత్తం ఎనిమిది లక్షల నువ్వే తినేసి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశావు ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావ్

అహోబిలం లో ఏదో 100 ఎకరాలకు కబ్జా చేశామని అంటున్నారు కదా  కేవలం అక్కడ అహోబిలం కు సంబంధించి 14 ఎకరాలు మాత్రమే ఉంది ఆ 14 ఎకరాలు కూడా మీ వాళ్లే మీ సీసా వెంకటేశ్వర్లు వైసిపి  నాయకులు అందరు కలిసి దోచుకున్నారు. మీరు ఫ్యామిలీ అహోబిలం వెళ్లి నప్పుడు అయ్యే భోజనాల ఖర్చుల కింద అహోబిలం మేనేజర్ భద్రయ్యకు 10 సెంట్లు దేవస్థానం భూమి ఇవ్వలేదా అక్రమ కట్టడాలు అంటున్నారు కధ ఎంక్వయిరీ కి మా ఎమ్మెల్యే గారు కూడా వస్తారు అక్రమ కట్టడాలు ఎవరివంటే వాళ్ళని పాడగొట్టేదాం దీనికి మీరు సిద్దమేన

మాజీ కౌన్సిలర్ పడకండ్ల గ్రామ టీడీపి నాయకుడు సుధాకర్ రెడ్డి :

మాజీ ఎమ్మెల్యే గారు రెండు రోజుల నుంచి ఇసుకపోయింది ఇసుకపోయిందంటే ఆరోపణ చేస్తున్నారు గత ప్రభుత్వంలో నీకే ఇసుక మీద గవర్నమెంట్ రెండు కోట్లు ఫైన్ వేయడం జరిగింది. ఉదయం లేస్తే నీ గురించే జపం చేస్తూ ఇసుక బకాసుడు భూ దందాదారుడు మైనింగ్ మాఫియా దారుడు అంటూ ఆరోపణలు చేసిన వ్యక్తి ఈరోజు మీ పక్కనే ఉన్నారు

గత ప్రభుత్వంలో మీ కౌన్సిలర్ ఎన్ని వసూళ్లకు పాల్పడ్డారో మీకు తెలియదా గేట్ల గురించి పడకండ్ల గ్రామంలో కూడా వచ్చి బెదిరించడం జరిగింది ఈరోజు మీరు గేట్ల గురించి మాట్లాడుతున్నారా గత ప్రభుత్వంలో ఎవరెవరైతే వసూళ్లు దందాలు, భూ దందాలు చేశారో వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నారు ఇప్పుడు. రైతుల దగ్గర ఏదో వసూలు చేస్తున్నారు రిజిస్టర్ ఆఫీస్ లో వసూలు చేస్తున్నారంటూ అబద్ధపు ప్రచారాలు మానుకోండి ఏదైనా ఉంటే ఆధారాలతో నిరూపించండి

మా ఎమ్మెల్యే గారు వందరోజుల పరిపాలనలో అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు అవసరమైతే అభివృద్ధి కోసం సహాయ పడండి తప్ప ఇలాంటి మాటలు మానుకోండి గతంలో మీరు చెప్పేవారు కదా ఏదైనా ఉంటే నేను ప్రజలకు సమాధానం చెప్తాను నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మా ఎమ్మెల్యే గారు కూడా అంతే ప్రజలకే సమాధానం చెప్తారు ప్రజల కోసమే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular