ఏపీయూడబ్ల్యూజే (apuwj) వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో “సేవ్’ జర్నలిజం” డే”కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి” సేవ్ జర్నలిస్టు” డే. కార్యక్రమం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానీకై వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేశామన్నారు . ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నంద్యాల జిల్లా కార్యదర్శి సిహెచ్. బ్రహ్మం , (ఆంధ్రప్రభ)జిల్లా కోశాధికారి మద్దిలేటియాదవ్,(10టీవీ) కార్యవర్గ సభ్యులు , టీవీ9 తిరుపతి, సుబ్బయ్య (న్యూస్ 360,) నాగ సుధాకర్ (ఆర్ టి వి)అధ్యక్షతన పాల్గొన్నారు. అనంతరంవారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు అడ్డగోలు నిబంధనల కారణంగా అక్రిడేషన్ జారీ అరకొరగా జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు అందరికీ గృహాలు. ఇంటి పట్టాలు. హెల్త్ కార్డులు. అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం జీవోను అమలును నిలిపివేయడంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా మెరుగైన సహాయం చేద్దామని అంటూ చెప్పిన ప్రభుత్వ పెద్దల హామీ కూడా అలాగే మూలన పడిందని అన్నారు. జర్నలిస్టులపై పలు జిల్లాలలో దాడులు జరిగాయి పైగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ సమస్యలను పౌర సమాజం దృష్టిలో ఇచ్చేందుకు సమస్యల పరిష్కారం కోసం మనం సాగిస్తున్న ఉద్యమానికి పౌర సమాజ మద్దతు కూడగట్టేందుకు అక్టోబర్ 2వ తేదీ సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సిటీ కేబుల్ ఛానల్ మహమ్మద్ రఫీ., టీవీ 5 మణికంఠ, జర్నలిస్టులు NTV హుస్సేన్ భాష, స్వతంత్ర టీవీ శ్రీనివాసులు పాత్రికేయులు (బి టెన్ )శేఖర్., శ్రీధర్ (తేజ టీవీ) , జై టీవీ మహబూబ్బాషా. కాసిం వలి. ప్రసాద్ (హెచ్ఎంటీవీ) డిడి భాష. ధీరజ్. (బిగ్ టీవీ.)రమేష్ (6 టీవీ) v5tv బాషా.
ఆళ్లగడ్డ : apuwj ఆధ్వర్యంలో సేవ్’ జర్నలిజం” డే”కార్యక్రమం
RELATED ARTICLES