TEJA NEWS TV
ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్నూలు- కడప జాతీయ రహదారిలోని ఆల్ఫా కళాశాల వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చాగలమర్రి మండలం మద్దూరు గ్రామానికి చెందిన కొత్త మాసి యోహాన్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై గ్రామానికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు రూరల్ ఎస్సై నరసింహులు శనివారం తెలిపారు. మృతదేహాన్ని శనివారం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై నరసింహులు తెలిపారు.