Saturday, January 18, 2025

ఆళ్లగడ్డ రూపురేఖలు మారుస్తాం…భూమా అఖిలప్రియ
100 పడకల ఆసుపత్రితో పాటు 3 అన్నా క్యాంటీన్లు

TEJA NeWS TV

ఆళ్ళగడ్డ  రూపురేఖలను మారుస్తామని .. 50 పడకల ఆసుపత్రి ని వంద పడకల స్థాయికి తీసుకుని వెళ్తామని.. పేదల ఆకలి తీర్చేందుకు పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభాముఖంగా హామీ ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బుధవారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం  కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు కొట్లాటలు.. కేసులు… అప్పులతో కాలక్షేపం చేశారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఎన్నో కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మెగా డీఎస్సీ మీద తొలి సంతకం తో పాటు , వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లను పెంచిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు.  ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో తమ పేరు వాడుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారు తమ వారైనా సరే భయపెట్టి వారిపై చర్యలు తీసుకుంటామని  వార్నింగ్ ఇచ్చారు.

శ్రీమంతం , అన్న ప్రాసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
ఆళ్ళగడ్డ పురపాలక సంఘ భవన ఆవరణలో పోషక మాసంలో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు ఏర్పాటు చేసిన  సామూహిక శ్రీమంతం మరియు అన్న ప్రాసన కార్యక్రమాల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు పూలు , పండ్లు , పసుపు కుంకుమలతో శ్రీమంతం చేసి వారికి చీరలను అందించారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ మాట్లాడుతూ… ఐసిడిఎస్ అధికారులు ఏర్పాటుచేసిన శ్రీమంతం మరియు అన్నప్రాసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. గర్భిణీ స్త్రీలు మంచి పోషకాలతో కూడుకున్న ఆహారాన్నీ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి మండల తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి,మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి , ప్రముఖ వైద్యులు డాక్టర్ రాంగోపాల్ రెడ్డి కౌన్సిలర్ హుస్సేన్ బాషా తెలుగుదేశం పార్టీ నాయకులు  మహిళలు , మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular