


TEJA NEWS TV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగురవేసిన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరి డాక్టర్ వసంత, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ సుజాత లు న్యాయ నిర్నేతలగా పాల్గొని బహుమతులను పంపిణీ చేశారు. ముగ్గుల పోటీ మొదటి బహుమతి ఆళ్లగడ్డ లోని పాలసాగరానికి చెందిన జ్యోతికి, రెండవ బహుమతి సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి
మూడవ బహుమతి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన భారతికి అందజేశారు. అలాగె
గాలిపటం ఎగరవేసే పోటీల్లో మొదటి బహుమతి నంద్యాల పట్టణానికి చెందిన సాయి కార్తీక్ రెడ్డి,
రెండవ బహుమతి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సురేంద్ర లకు అందజేసి అభినందనలు తెలిపారు.