


TEJA NEWS TV: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి .వెంకట రాముడు గారి ఆదేశాలమేరకు జిల్లాలో మాదకద్రవ్యాల నివారణ పై విద్యార్థి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కు చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ N.చంద్రమణి గారు ఆళ్లగడ్డ పట్టణంలోని అనంత జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ N .చంద్రమణి గారు మాట్లాడుతూ నేటి సమాజంలో యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు వాటికి బానిస కాకూడదు అని తెలియజేశారు. ఎవరైనా అటువంటి వాటిని వినియోగిస్తున్న లేదా సరఫరా చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మాదకద్రవ్యాలు వినియోగించడం వలన ఆరోగ్యం దెబ్బతిని జీవితం కోల్పోవలసి వస్తుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో SEB ఇన్స్పెక్టర్ N .చంద్రమణి గారితో పాటు అనంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి గారు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం,నంద్యాల