Friday, January 16, 2026

ఆళ్లగడ్డ : మధ్య వర్తిత్వం ద్వారా తగాదాలకు శాశ్వత పరిష్కారం  పొందుదాం – న్యాయమూర్తులు శ్రీమతి.శైలజ,శ్రీ భాస్కర్

TEJA NEWS TV : ఆళ్లగడ్డ పట్టణములో న్యాయమూర్తులు, న్యాయవాదుల ,పోలీసుల ర్యాలీ…
ఆళ్లగడ్డ,జూలై16,మధ్య వర్తిత్వం ద్వారా
తగాదాలకు శాశ్వత పరిష్కారము పొందుదాo అని ఆళ్లగడ్డ సబ్ కోర్టుసీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి.యస్.శైలజ గారు, జూనియర్ సివిల్ జడ్జి శ్రీ టి. భాస్కర్ లు పేర్కొన్నారు.మధ్య వర్తిత్వంతో సమయం వృథా కాదు,వివిధ కేసుల్లో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా సమస్య త్వరితగతిన ప్రయోజనం చేకూరు తుందని న్యాయమూర్తులు తెలియజేశారు.బుధవారం
నాడు ఆళ్లగడ్డ సబ్ కోర్టు నుంచి ఒక కిలో మీటర్ ర్యాలీలో న్యాయమూర్తులు శ్రీమతి. యస్.శైలజ గారు, శ్రీ.టి. భాస్కర్ గారు ,న్యాయ వాదులు, కోర్టు సిబ్బందితో కలిసి ర్యాలీ
నిర్వహించారు.ఈ సందర్భంగా ఆళ్లగడ్డ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి.శైలజ గారు
మాట్లాడుతూ, సమస్య సామ రష్య పూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు. పెండింగ్ లో ఉన్న ఆయా సంస్థల  సివిల్,కాంపౌండ్, క్రిమినల్ కేసులురాజీ పడగ ఇతర కేసుల గురించి గుర్తించి వాటి పరిష్కారం మధ్యవర్తిత్వం  ఉపయోగ పడుతుందన్నారు.
ఆళ్లగడ్డ జూనియ సివిల్ జడ్జిశ్రీ.టి.భాస్కర్ గారు మాట్లాడుతూ,న్యాయ స్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను కక్షి దారులుమధ్య వర్తిత్వంతో రాజీకి రావచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో ఆళ్లగడ్డ బార్అసోసియేషన్ అధ్యక్షుడుసి.శివరామిరెడ్డి, ఏజిపి బాలగుర్రెడ్డి,ఎంపిపి శివప్రసాదరావు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయ వాదులు  ,ఆళ్లగడ్డ పోలీస్ అధికారులు టౌన్ సీఐ , టౌన్ యస్. ఐ.లుపోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular