రిపోర్టర్ పి.శ్రీధర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల తాసిల్దార్ శ్రీమతి జ్యోతి రత్నకుమారి 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు ఎంపికయ్యారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓటర్ల జారీ తయారి , ఓటర్ల జాబితా తయారీకి పలు సూచనలు, నూతన ఓటర్లను చేర్పించటం, అనర్హులను తొలగించటం, ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను పరిష్కరించటం, ఎన్నికలను సజావుగా నిర్వహించటం తదితర అంశాలనుఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ పనితీరు కనబరిచినందుకు ఎన్నికల కమిషనర్ బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డుకు తాసిల్దార్ జ్యోతిరత్నకుమారిని ఎంపిక చేశారు. ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న కార్యక్రమంలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆళ్లగడ్డ తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి బెస్ట్ ఎలక్ట్రోరల్ అవార్డును స్వీకరిస్తారు.
ఆళ్లగడ్డ మండల తహసిల్దార్ కు ఉత్తమ అధికారిగా అవార్డు
RELATED ARTICLES