

రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
TEJA NEWS TV
ఆళ్లగడ్డ పట్టణంలోని 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయ ఆవరణలోని చెత్తాచెదారాన్ని, అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆసుపత్రి పరిధిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ లను క్లీన్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి మూడవ శనివారం కూడా ఇదే విధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తామని డాక్టర్ సుజాత తెలిపారు.