TEJA NEWS TV
వైసీపీ నేతలు విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డు వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇసుక గురించి మాట్లాడుతున్నారని భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ యదేచ్చగా జరిగిందని విమర్శించారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక లారీ ఇసుక లక్ష రూపాయలు, ట్రాక్టర్ ఇసుక 12 వేల రూపాయలు అమ్మిన రోజులు లేవా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక అభివృద్ధి విషయానికొస్తే ప్రతి గ్రామానికి సి.సి రోడ్లను నిర్మించడం జరిగిందని.. అభివృద్ధి ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే ఎలా విమర్శలు చేస్తారని మల్లయ్య ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ (శృంగారపు శ్రీనివాస్) పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పోసాని కృష్ణమురళి కి పట్టిన గతే పడుతుందని పోసాని కృష్ణమురళి కి పట్టిన గతే మీకు పడుతుందని మైలేరి మల్లయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవాంజనేయులు, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: పవన్ కళ్యాణ్ ను విమర్శించిన దువ్వాడ శ్రీనివాస్ పై మైలేరి మల్లయ్య ధ్వజం
RELATED ARTICLES