TEJA NEWS TV ALLAGADDA
ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.మండల తాసిల్దార్ గాండ్ల చంద్రశేఖరయ్య ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో
అందిన దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేస్తామని తాసిల్దార్ చంద్రశేఖరయ్య తెలిపారు.నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.