TEJA NEWS TV ALLAGADDA
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ భారతి విద్యా మందిరం ఉన్నత పాఠశాలలో రానున్న విద్యా సంవత్సరం నుండి నూతన విద్యా ప్రణాళికతో ముందుకు వెళ్ళి పాఠశాలకు పునర్ వైభవం తీసుకొని వస్తామని శ్రీ భారతి విద్యా మందిరం పాఠశాల అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీ.ఎం.సీ. వేణుగోపాల్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక విద్యా మందిరం పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆళ్లగడ్డ ప్రధానోపాధ్యాయురాలు సావిత్రమ్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత చక్కగా కృషి చేస్తున్నారని ఆమె హెచ్ఎం సావిత్రమ్మను అభినందించారు.శ్రీ సరస్వతి విద్యాపీఠం శాఖలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని తమ పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు, సంస్కారంతో కూడిన విద్యా బోధన, సదాచారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో నేడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి, వివిధ రంగాలలో పదవులను అలంకరించారని ఆయన పేర్కొన్నారు.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తమ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన 2013 నుండే ప్రారంభం కావడం జరిగిందని వేణుగోపాల్ తెలిపారు. ప్రస్తుతం తమ పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యా బోధనను అందించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ దిశగా పాఠశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
26 న పాఠశాల వార్షికోత్సవం..
ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తమ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మీడియా బృందానికి కూడా అధ్యక్షుడు టిఎంసి వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ప్రధాన కార్యదర్శి, విశ్రాంత లెక్చరర్ గోపాలరావు మాట్లాడుతూ శ్రీ భారతి విద్యా మందిరం ఏర్పాటు అయి సుమారు 50 సంవత్సరాలు అయిందని ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత స్థానాలు అలంకరించారని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రమ్మ మాట్లాడుతూ ఆళ్లగడ్డ పాఠశాలలో తనకు పనిచేసే భాగ్యాన్ని కల్పించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుండి పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని, అందుకు మీడియా యాజమాన్యం సహకారం కావాలని సావిత్రమ్మ పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ : నైతిక విలువలు…సంస్కారంతో కూడిన విద్యా బోధనే తమ పాఠశాల లక్ష్యం..
RELATED ARTICLES