


నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ..
రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నె మరియు రుద్రవరం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి నూతన బ్రిడ్జి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు…
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని వైసిపి నాయకులకు అవన్నీ కనిపించడం లేదని. కావాలని మా పై బురదజల్లే మాటలు మాట్లాడుతున్నారని ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగ పడేవి చేయాలనీ తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
ఈరోజు ఎర్రగుడిదిన్నె గ్రామం నుండి రుద్రవరం వెళ్లే రూట్ కి నూతన బ్రిడ్జి కోసం ఒక కోటి 46 లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగిందని. ఎర్రగుడిదిన్నె గ్రామం మాజీ వైసీపీ ఎమ్మెల్యే సొంత ఊరు అయినా అందరూ వైసిపి వాళ్లే ఉన్నా కూడా ప్రజల కోసం మేము ఈరోజు బ్రిడ్జి కట్టిస్తున్నాం. అదే మా సొంత ఊరు కొత్తపల్లె లో. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు తెలిపారు…
మాకు ప్రజలందరూ ఒకటేనని వైసిపి వాళ్ళు అయినా టిడిపి వాళ్ళైనా అవసరం ఉందని వస్తే కచ్చితంగా చేస్తామని. ఆళ్లగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
వైసిపి నాయకులు మా పై బురదజల్లే మాటలు మాట్లాడుతున్నారు. వైసిపి మాజీ ఎమ్మెల్యేలపై లిక్కర్ కేసుల్లో జైల్ల కి తీసుకెళ్తుంటే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం టిడిపి ప్రభుత్వంపై బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
వైసీపీ నాయకులు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు చంద్రబాబును తిట్టండి అంటూ అదే చేస్తున్నారు తప్ప. సంవత్సరం టైమ్ లోనే ఎంత అభివృద్ధి చేశాం అనేది ఎవరూ చూడడం లేదని ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి తెలిపారు…
టిడిపి అంటేనే భూమా కుటుంబమని. మేము గెలిస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మమల్ని గెలిపించిన ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
ఎర్రగుడిదీన్నే అయినా కొత్తపల్లి అయినా ఆళ్లగడ్డ తాలూకాలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ సమస్య ఉన్న నన్ను అడగండి నేను చేస్తానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..



