TEJA NEWS TV : ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయ తాసిల్దారుగా గాండ్ల చంద్రశేఖరయ్య శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ గా ఉన్న చంద్రశేఖరయ్య కు పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగిస్తూ జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు ఆయన తాసిల్దార్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు సిబ్బంది ఆయనను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ చంద్రశేఖరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తనపై ఉంచిన గురుతర బాధ్యతలను తూ.చా తప్పకుండా నెరవేరుస్తానని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని నూతన తాసిల్దార్ చంద్రశేఖరయ్య పేర్కొన్నారు