ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ నూతన డీ.ఎస్పీగా రవికుమార్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ చిరంజీవి, రూరల్ సీఐ కంబగిరి రాముడు, టౌన్ ఎస్ఐ షేక్ నగీనా నూతన డిఎస్పీ ని కలిసి అభినందనలు తెలియజేశారు.
ఆళ్లగడ్డ నూతన డిఎస్పీగా రవికుమార్ పదవీ బాధ్యతలు
RELATED ARTICLES