TEJA NEWS TV : ఈ రోజు 21-07-2025 న ఉదయం 11:30 గంటలకు సంజామల మండలం లో నకిలీ పాసుబుక్కులు తయారు చేసిన కేసులో నంద్యాల జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా, IPS వారి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ DSP శ్రీ ప్రమోద్ పర్యవేక్షణలో ముగ్గురు వ్యక్తులను కోవెలకుంట్ల CI పి. హనుమంత నాయక్ అరెస్టు చేయడమైనది. వీరి వద్ద నుండి 12 నకిలీ పాసుపుస్తకాలు, 5 title deed బుక్కులు స్వాధీనం చేసుకున్నాము.
అరెస్టు అయిన వారి పేర్లు వివరాలు:
1.సాయబోయిన ఉపేంద్ర, 29 yrs, S /o పాండురంగస్వామి, గొల్ల పేట, సంజామల(v&m), నంద్యాల జిల్లా.
ప్రస్తుతము ఇంటి నెం. 32/360(A), SPY రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బోర్డు దగ్గర, నంద్యాల టౌన్.
2.ఈపూరి వర ప్రసాద్, 49 yrs, S/o లక్ష్మీ నారాయణ, D.No.7-112, మెయిన్ రోడ్, సంజామల (v&m)
3.దూదేకుల మహమ్మద్ రఫీ, 32 yrs, S/o అబ్బాస్ మియా, D.No. 5-145, డొంగు స్ట్రీట్, గడివేముల (v&m), నంద్యాల జిల్లా.
2023 వ సంవత్సరంలో సంజామల మండల తహశీల్దారుG.V.మల్లికార్జునరావు అను అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజామల పోలీస్ స్టేషననులో 2023 వ సంవత్సరంలో కేసు నమోదు చేయడం జరిగింది. సంజామల మండల తహశీల్దారుఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్,సంజామల గ్రామానికి చెందిన ఉపేంద్ర లు నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసి, లేని భూమిని ఉన్నట్లుగా పేరుసోముల, గిద్దలూరు,R.లింగందిన్నె, ముదిగేడు ప్రాంతాల్లో కొత్త సర్వే నంబర్లు సృష్టించి 55 మందికి నకిలీ పాసుబుక్కులు ఇచ్చి online ఎక్కించినారు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు చొప్పున వ్రాసి ప్రజల వద్ద నుండి ఒక్క పాసుబుక్కుకు 30,000/- రూ,, డబ్బులు తీసుకుని ఇచ్చినారు. వీరిలో సుమారు 49 మంది వేరు వేరు బ్యాంకులలో లోను కూడా సుమారు 80 లక్షలు తీసుకున్నారు.
ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఉపేంద్రకు, బషీర్ అహ్మదుకు తెలిసిన సంజామల గ్రామానికి చెందిన ఈపూరి వరప్రసాద్, గడివేములకు చెందిన దూదేకుల మహమ్మద్ రఫీ, దూదేకుల పెద్ద జమాల్ బాషా,కర్నూలు టౌన్ కు చెందిన అబ్దుల్ సత్తార్, కంపమల్లకు చెందిన వరప్రసాద్ లు అమాయకులను ఎన్నుకొని వారికి నిజం చెప్పకుండా లేని భూమిని ఉన్నదిగా చెప్పి ఈ నకిలీ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది మరియు 2018లో అప్పటి MRO ఎద్దుల ఎలిజిబెత్ onlineకు అప్రూవల్ చేసింది అని తెలిసింది. 06 సర్వే నంబర్లు సృష్టించి 321.83 ఎకరాలు లేని భూమిని ఉన్నదిగా చూపించి 67 మందికి online ఎక్కించినారు, 55 మందికి పాస్ బుక్ లు ఇచ్చినారు. వీరి వద్దనుండి మొత్తం 12 పాసుబుక్కులు అందులో 5 title deed బుక్కులు స్వాధీనం చేసుకోవడమైనది ఈ పాసుబుక్కులు తీసుకున్న వారందరూ సంజామల, కోవెలకుంట్ల, గడివేముల, నందికొట్కూరు,కర్నూలు జిల్లాకు చెందిన వారుగా తేలింది. ప్రభుత్వ సొమ్ము లోన్ క్రింద తీసుకున్న వారందరూ లోన్లు తిరిగి కట్టాలి లేకపోతే వారు కూడా ఈ కేసులో ముద్దాయిలవుతారు.
ఆళ్లగడ్డ : నకిలీ పట్టాదారు పాసుబుకుల తయారీ ముఠాను అరెస్టు చేసిన సంజామల పోలీసులు
RELATED ARTICLES



