TEJA NEWS TV
ఆళ్లగడ్డ పురపాలక సంఘం కార్యాలయం నందు గౌరవ కమిషనర్ కిషోర్ గారు మాట్లాడుతూ *ఓపెన్ డెఫికేషన్ ప్లస్* ( బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్లస్ నగరంగా) తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలు మరియు పట్టణంలోని అందరూ స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ప్రజలలో విస్తృతంగా అవగాహన కలిగించి పట్టణాన్ని మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ కమిషనర్ గారు తెలియజేస్తూ ప్రజలనుండి ఏవైనా సలహాలు సూచనలు లేదా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల లోపల రాత పూర్వకంగా పురపాలక సంఘం కార్యాలయము నందు సమర్పిస్తే వాటిని అన్నింటినీ పరిగణనలోనికి తీసుకొనబడునని ప్రజలందరూ కృషితో ఆళ్లగడ్డ పురపాలక సంఘం ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా చేయుటకు ప్రతి పౌరుడు కృషి చేయవలెనని తెలియజేశారు.
ఆళ్లగడ్డ : ఓపెన్ డెఫికేషన్ ప్లస్ ( బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్లస్ నగరంగా) తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం – కమిషనర్ కిషోర్
RELATED ARTICLES