TEJA NEWS TV


రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజిపి) గా నియామకమైన న్యాయవాది కమతం బాలగుర్రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు కూడా నూతన ఏజిపి గా నియమితులైన కమతం బాల గుర్రెడ్డి కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు శివరామి రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, షేక్ బాబా ఫక్రుద్దీన్, తేజారెడ్డి, రమణయ్య అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.