ఆళ్లగడ్డ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయాన్ని మంగళవారం జిల్లా ఖజానా శాఖ అధికారి మరియు గణాంక అధికారి ఏం. లక్ష్మీదేవి తనిఖీ నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆమె ఆళ్లగడ్డ ఖజానా కార్యాలయానికి చేరుకొని పలు రికార్డులను పరిశీలించారు. ఖజానా ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్లు, గణాంక విభాగంకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల దస్త్రాలను ఉంచే ఖజానాను కూడా పరిశీలించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ దారులకు పలు కీలక సూచనలు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగులు నామినేషన్ సౌకర్యాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని పెన్షన్ దారుడు జీవించి ఉన్నప్పుడే తమ ఫైల్స్ లో నామినేషన్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీదేవి సూచించారు. నామినేషన్ ఉంటే ఎలాంటి సమస్యలు రావని కోర్టుకు కూడా వెళ్లే పరిస్థితి ఉండదని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి సుశీల, అకౌంట్ అధికారి, సిబ్బంది ప్రవీణ్ కుమార్, రాముడు తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ : ఉప ఖజానా కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఖజానా శాఖ అధికారి మరియు గణాంక అధికారి లక్ష్మీదేవి
RELATED ARTICLES