TEJA NEWS TV :
ఆ
కట్టుకున్న ధాత్రి రెడ్డి నృత్య ప్రదర్శన….
అభినందించిన ఎమ్మెల్యేశ్రీమతి భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ :
ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు గౌరు రామకృష్ణారెడ్డి కుమార్తె అయిన గౌరు ధాత్రి రెడ్డి భరతనాట్య కళాకారిణి. శనివారం సాయంత్రం స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ధాత్రి రెడ్డి నృత్య ప్రదర్శన కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాత్రి రెడ్డి చేసిన భరతనాట్యం నృత్య ప్రదర్శనను తిలకించి.. ఆమె నాట్య పటిమను ప్రశంసించారు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సిపి శ్రీనివాస్ రెడ్డి, బీబీ రామిరెడ్డి దాచపురం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.