నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ :
ప్రజల్లో ఒకటో తారీకు వచ్చిందంటే పండగ వాతావరణం కనబడుతుంది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం 3000 పింఛన్ నుండి 4000 పెంచి ఒకటో తారీకునే ఇస్తున్నారు కనుక ప్రజలు అందరు సంతోషం గా ఉన్నారు అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు…
ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తున్నారని. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుందని. ఇలాంటి అభివృద్ధి పనులు చూడలేక వైసీపీ నాయకులు మాపై బురదజల్లే మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు…
మేము ఆళ్లగడ్డలో అభివృద్ధి చేయలేదు అంటున్నారు గా మీరు వైసీపీ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం ఎంత అభివృద్ధి పనులు చేశారో చూపించండి. మేము మా ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరం ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాము. మీరు డెబిట్ కు సిద్ధమా అని నేను అడుగుతున్నా….
మాజీ ఎమ్మెల్యే సొంత ఊరైనా కూడా కోటి 40 లక్షల రూపాయలతో నిన్న బ్రిడ్జి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అదే మా ఊరు అయితే వైసీపీ నాయకులు చేసేవారా అని నేను అడుగుతున్నాను. మాకు ప్రజలందరూ ఒకటే ఆళ్లగడ్డను అభివృద్ధి దిశగా తీసుకొని పోవడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు…
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధికి అభివృద్ధి కోసం మూడు కోట్లు మంజూరు చేయడం జరిగిందని అలాగే మంత్రి నారాయణ గారు ఇంకా కొన్ని సమస్యలు ఉండడంతో 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని. ఆళ్లగడ్డ అంటే అభివృద్ధిలో అమరావతి వరకు వెళ్లేలాగా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు..
అహోబిలంలో స్వదేస్ స్కీం కింద 25 కోట్ల రూపాయలు మంజూరు అయిందని. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు గండికోట పర్యటనలో భాగంగా శిలాఫలకాన్ని ఓపెన్ చేయబోతున్నారని. అలాగే చింతకుంట్ల గ్రామ ముస్లిం సోదరుల కోసం కాంపౌండ్ వాల్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగి మంజూరు చేపిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు
ఆళ్లగడ్డ అభివృద్ధే మా లక్ష్యం – ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
RELATED ARTICLES



