



TEJA NEWS TV: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన చదువుల పండుగ – మెగా పీటీఎం 2.0 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు పాల్గొన్నారు.
ఎద్దులపాపమ్మ హై స్కూల్, కాలేజ్, పడకండ్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ –
“తల్లికి వందనం” పథకం కింద ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేరుగా డబ్బులు వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక్కరికే వచ్చే అమ్మ ఒడి పథకం కన్నా ఈ పథకం ప్రజలందరికి మేలు చేస్తుందన్నారు.
పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా, తల్లిదండ్రులు వారిపై నిత్యం దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లలతో గడపకపోతే వారు తప్పుదారి పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి ఎన్నోమంది ఉన్నత స్థానాల్లో ఉండటాన్ని గుర్తుచేస్తూ, చదువులో, క్రీడల్లో, ఇతర రంగాల్లో ఆకాంక్షలు ఉన్న ప్రతి ఒక్కరికీ తాను సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు.ఇప్పటికే ఆళ్లగడ్డ తాలూకాలో జాబ్ మేళా ద్వారా 500 మందికి ఉద్యోగాలు కల్పించామని, రాష్ట్రంలోనే పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే దిశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇకపై పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు.



