ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా | గురువారం: ఆళ్లగడ్డ పట్టణం పడకండ్ల శివారులలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా అహోబిలం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయంగా మారింది. కాలువలు నిండిపోవడంతో నీరు రోడ్డుపైకి ప్రవహించి రెండు వైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశాల మేరకు, తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి, డీఎస్పీ కె. ప్రమోద్, టౌన్ సీఐ యుగంధర్, మున్సిపల్ కమిషనర్ కిషోర్, మున్సిపల్ మేనేజర్ ఆనంద్, వీఆర్వో కిషోర్, రాజగోపాల్ రెడ్డి, ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి తదితర అధికారులు వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించి నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.
అధికారుల చురుకైన చర్యలతో రాకపోకలకు మార్గం సుగమం అయింది. అదేవిధంగా, ఓబులంపల్లి రహదారిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.




