TEJA NEWS TV
ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండు, టిబి రోడ్డు, నాలుగు రోడ్ల సెంటర్ కూడళ్లలో టౌన్ సీఐ చిరంజీవి, పోలీస్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సిఐ చిరంజీవి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలని, అలాగే కెపాసిటీకి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించుకోరాదని హెచ్చరించారు.డ్రైవింగ్ లైసెన్సు వాహన రికార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ చిరంజీవి హెచ్చరించారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐలు షేక్ నగీన, వెంకటరెడ్డి పోలీ సిబ్బంది పాల్గొన్నారు.